Breaking: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కేసు నమోదు

| Edited By:

Aug 09, 2020 | 1:38 PM

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. స్థానిక ఎమ్మార్వో జయశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Breaking: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కేసు నమోదు
Follow us on

Vijayawada Fire Accident: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. స్థానిక ఎమ్మార్వో జయశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపబోతున్నట్లు వారు తెలిపారు. అయితే శానిటైజర్‌ వలనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే కరోనా ట్రీట్‌మెంట్‌కి పర్మిషన్ లేనట్లు గుర్తించిన పోలీసులు, దానిపై కూడా విచారణ జరపనున్నారు.  రమేష్ ఆసుపత్రి చేస్తున్న ట్రీట్‌మెంట్‌ వ్యవహారంపై కూడా విచారణ కొనసాగుతోంది. కాగా స్వర్ణ  ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్‌కి అనుమతి తీసుకోలేదని ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్‌ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను బేఖాతరు చేశారని, హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా ఈ తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డ విషయం తెలిసిందే.

Read This Story Also: క్రేజీ కాంబోలో ఆరో సినిమా ఆగిపోయిందా!