అటవీ అధికారులను అడ్డుకున్న రైతులు.. ఇల్లెందులో ఉద్రిక్తత

| Edited By: Pardhasaradhi Peri

Jul 06, 2019 | 5:26 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీ భూములను చదునుచేస్తున్న అటవీ, పోలీసు అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 30మంది రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో ఇరు వర్గాల వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఎఫ్‌డిఓ అనిల్ కుమార్, ఎఫ్‌ఆర్‌ఒ రవి కిరణ్, ఇల్లెందు సీఐ వేణు చందర్ తదితరులు ఉన్నారు.

అటవీ అధికారులను అడ్డుకున్న రైతులు.. ఇల్లెందులో ఉద్రిక్తత
Follow us on