ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రి దందా.. స్పందించిన ప్రధాని ఆఫీస్‌

| Edited By:

Sep 06, 2020 | 5:23 PM

కరోనా వేళ రోగుల పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు జాలి చూపించాలని, కరోనా పేరుతో వారి నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రి దందా.. స్పందించిన ప్రధాని ఆఫీస్‌
Follow us on

Private Hospital loot: కరోనా వేళ రోగుల పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు జాలి చూపించాలని, కరోనా పేరుతో వారి నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా, కొందరి తీరు మారడం లేదు. కరోనా చికిత్స కోసం వెళుతున్న రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకంపై ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మెయిల్‌ పంపారు.

ఒక్కొక్కరి దగ్గర 4 నుంచి 14లక్షలు ఆసుపత్రి యాజమాన్యం వసూలు చేసిందని అతడు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా చికిత్స కూడా సరిగా చేయలేదని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని స్పందించాలని, లేదంటే న్యాయపరంగా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆ వ్యక్తి మెయిల్‌లో పంపారు. ఇక దీనిపై ప్రధాని ఆఫీస్ స్పందించింది. ఈ విషయంపై చూడాలంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి జనార్ధన్‌కి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. దీనిపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఆరోగ్య అధికారికి ప్రధాని ఆఫీస్ సూచించినట్లు తెలుస్తోంది.

Read More:

అమానుష ఘటన.. కరోనా బాధితురాలిపై అంబులైన్స్ డ్రైవర్ అత్యాచారం

రాజమౌళికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్‌.. ఏంటంటే