‘రైతు బంధు’కు అర్హులు వీరే.. మార్గదర్శకాలు విడుదల

| Edited By:

Jun 16, 2020 | 5:15 PM

రైతులను సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రైతుబంధు’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మార్గదర్శకాల ఉత్తర్వులను జారీ చేశారు. బడ్జెట్ ప్రతిపాదన సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే రైతుబంధు జమ కానుంది. అలాగే ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ సాయం అందనుంది. వీరితో పాటు పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు చేసుకుంటున్న 621 […]

రైతు బంధుకు అర్హులు వీరే.. మార్గదర్శకాలు విడుదల
Follow us on

రైతులను సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రైతుబంధు’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మార్గదర్శకాల ఉత్తర్వులను జారీ చేశారు. బడ్జెట్ ప్రతిపాదన సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే రైతుబంధు జమ కానుంది. అలాగే ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ సాయం అందనుంది. వీరితో పాటు పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు చేసుకుంటున్న 621 మంది పట్టాదారులకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రైతుబంధు సాయం అందిస్తామని అందులో పేర్కొన్నారు.

కాగా రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి సీజన్‌కి ముందు భూముల లావాదేవీలను పరిశీలించనున్నారు. ఒకవేళ ఎవరైనా భూములు అమ్మి ఉంటే.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఈ సాయం ఇవ్వనున్నారు. నిధుల విడుదలలో భాగంగా మొదట తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే రైతు బంధు సాయాన్ని వదులుకోవాలనుకునేవారు గివ్ ఇట్ అప్‌ ఫారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఆ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా వారం, పదిరోజుల్లోనే రైతులందరికీ రైతుబంధు సాయం అందాలని ఇటీవల కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: సుశాంత్‌కి నివాళులర్పించిన ‘ఇంటర్నేషనల్ స్పేస్‌ యూనివర్సిటీ’