ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

| Edited By:

Apr 11, 2020 | 9:55 PM

ఏప్రిల్ 30వ తేదీ వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈవిధమైన నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30వ తేదీ ..

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌
Follow us on

ఏప్రిల్ 30వ తేదీ వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈవిధమైన నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. మే 1వ తేదీ వరకూ ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మంది మరణించారని అధికారికంగా తెలిపారు కేసీఆర్. అలాగే 96 మందిని డిశ్చార్జి చేయగా, 393 యాక్టీవ్ కేసులున్నాయన్నారు. ఇవాళ ఒక్కరోజే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు:

1. టెన్త్ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
2. ఒకటి నుంచి 9 తరగతుల విద్యార్థులు నెక్ట్స్ క్లాసులకు ప్రమోట్. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
3. కేబినెట్ నిర్ణయాలను ప్రధానికి నివేదిస్తాం
4. రైతులు యాథావిధిగా పనులు చేసుకోవచ్చు
5. జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి
6. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలన్నారు

మరిన్ని కేసీఆర్ వ్యాఖ్యలను ఈ కింది లైవ్‌లో..

ఇవి కూడా చదవండి:

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం