హైదరాబాద్ ఐఐటీ సమీపంలో చిరుత హల్‌చల్

|

Jun 08, 2020 | 10:20 PM

లాక్‌డౌన్ తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గడంతో ఇటీవల కాలంలో నగర శివార్లలోని అడవుల్లో ఉన్న జంతువులు యథేచ్ఛగా రోడ్లపైకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఏకంగా జనావాసాలకు సమీపంలోకే వచ్చేసిన చిరుతలు హైదరాబాద్ నగర ప్రజలను హడలెత్తిస్తున్నాయి.

హైదరాబాద్ ఐఐటీ సమీపంలో చిరుత హల్‌చల్
Follow us on

లాక్‌డౌన్ తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గడంతో ఇటీవల కాలంలో నగర శివార్లలోని అడవుల్లో ఉన్న జంతువులు యథేచ్ఛగా రోడ్లపైకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఏకంగా జనావాసాలకు సమీపంలోకే వచ్చేసిన చిరుతలు హైదరాబాద్ నగర ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొన్న రంగారెడ్డి జిల్లాలో చిరుత హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఇండోర్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది.

హైదరాబాద్ ఐఐటీ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత హల్‌చల్ చేసింది. ఐఐటీ ఆ పరిసరాల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటలపాటు శ్రమించిన అటవీ సిబ్చిబంది ఎట్టకేలకు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రెస్క్యూటీమ్ చిరుతను వలలో బంధించి, వ్యాన్ ఎక్కించింది. ఈ భారీ చిరుతను బంధించినా చాలాసేపు గాండ్రిస్తూనే ఉంది. నివాస ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతను అధికారులు జూకు తరలించారు.