అవ్వా… బాగున్నావా..అంటూ మంత్రి కేటీఆర్ పలకరింపు…

| Edited By: Pardhasaradhi Peri

May 22, 2020 | 8:23 PM

మంత్రి కేటీఆర్ అప్యాయతలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవ్వా బాగున్నావా...నీ పానం ఎట్లుంది అంటూ మంత్రి కేటీఆర్ ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన సన్నివేశం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అవ్వా... బాగున్నావా..అంటూ మంత్రి కేటీఆర్ పలకరింపు...
Follow us on

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అప్యాయతలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవ్వా బాగున్నావా…నీ పానం ఎట్లుంది అంటూ మంత్రి కేటీఆర్ ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన సన్నివేశం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్ యాదగిరి నగర్ లో మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బస్తీ దవాఖాను ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడకు వచ్చిన ఓ వృద్ధురాలిని ఎంతో ప్రేమగా పలకరించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామోహన్. కలెక్టర్ శ్వేతా మహంతి. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్థానికంగా వైద్య సేవలను విస్తృతం చేసేందుకు సర్కార్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. వీటికి మంచి ఆదరణ లభిస్తుండటంతో కొత్తగా మరో 45 దవాఖానాలను ప్రారంభించింది. హైదరాబాద్‌లో 22, మేడ్చల్ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3 దవాఖానాలు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 123 బస్తీ దవాఖానాలు ప్రతి రోజు 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి.