విజయవాడకు పొంచివున్న ముంపు..ఆయా ప్రాంతాలకు అలర్ట్

|

Oct 16, 2020 | 5:37 PM

భారీ వర్షాలకు ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద మరింత పెరిగే అవకాశముందని.. ఊహించని రీతిలో భారీగా వరద వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

విజయవాడకు పొంచివున్న ముంపు..ఆయా ప్రాంతాలకు అలర్ట్
Follow us on

భారీ వర్షాలకు ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరనుందని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన వరద ఉధృతిపై అధికారులను అప్రమత్తం చేశామని వివరించారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద మరింత పెరిగే అవకాశముందని.. ఊహించని రీతిలో భారీగా వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయం పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ఉన్న 7.50 లక్షల క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో మధ్యాహ్నం 1.30 గంటలకు 8 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నట్లు చెప్పారు. దీంతో నది పరివాహక ప్రజలు నివాస ప్రాంతాలు ఖాళీ చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 6 లక్షల 36వేల 921కాగా అవుట్‌ ఫ్లో 6 లక్షల 32 వేల 961 క్యూసెక్కులు. చినలంక,పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం ఎవ్వరూ చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తున్నారు.