ఉప్పొంగిన కాగ్నా నది… కొట్టుకుపోయిన వంతెన

|

Jul 03, 2020 | 11:58 AM

Kangna Bridge Collapse:  వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నానది వంతెన రహదారి కొట్టుకుపోయింది. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్‌-తాండూర్‌ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన తెగిపోయింది. దీంతో తాండూరు, మహబూబ్‌నగర్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటలకుపైగా కురిసిన వర్షానికి కాగ్నానదికి భారీగా వరదనీరు చేరింది. ఈ నేపథ్యంలో రహదారి […]

ఉప్పొంగిన కాగ్నా నది... కొట్టుకుపోయిన వంతెన
Follow us on

Kangna Bridge Collapse:  వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నానది వంతెన రహదారి కొట్టుకుపోయింది. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్‌-తాండూర్‌ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన తెగిపోయింది. దీంతో తాండూరు, మహబూబ్‌నగర్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటలకుపైగా కురిసిన వర్షానికి కాగ్నానదికి భారీగా వరదనీరు చేరింది. ఈ నేపథ్యంలో రహదారి కింద నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. అయితే మధ్యభాగంలో మట్టి కొట్టుకుపోవడంతో రహదారి ఆ ధాటికి నిలవలేకపోయింది.