దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం: జగదీష్ రెడ్డి

|

Jul 07, 2020 | 6:53 PM

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు టీఆర్ఎస్ మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్.

దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం: జగదీష్ రెడ్డి
Follow us on

శిథిలాల్లో కూర్చోవాల్సిన అవసరం లేదు..
కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ మంత్రులు..
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు టీఆర్ఎస్ మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌ అండ్‌ గ్యాంగ్‌ మాటలు వింటుంటే.. వారి బానిస మనస్తత్వం బయటపడుతోందన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. విద్యుత్‌ పంపిణీలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా కాంగ్రెస్‌ నేతలకు కలలో కూడా సాధ్యం కాదన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు ఇచ్చే పథకం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.

ఎక్కడలేనటువంటి వినూత్న పథకంల ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుల మేలు కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో పెడింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను తాము పూర్తిచేశామన్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ అనవర రాద్దాంతం చేస్తోందని అన్నారు. పాత సచివాలయ శిథిలాల్లో కూర్చోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కొత్త సచివాలయం నిర్మాస్తామని ప్రజలకు చెప్పామని, అదే ఇప్పుడు చేస్తున్నామని అన్నారు.