తాడేపల్లిగూడెంలో రెండోరోజు కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

| Edited By:

Jun 26, 2019 | 10:57 AM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆక్రమణల తొలగింపు రెండో రోజు కొనసాగుతోంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వేంకటేశ్వరస్వామి ఆలయ భూములను ఆక్రమించి నిర్మాణాలు కడుతున్నారని ఆరోపణలు చేసిన ఆ దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం నుంచి వాటిని కూల్చేపనిలో పడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ఆక్రమణలను అడ్డుకున్న 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధర్‌తో పాటు మరో 16మందిపై ఉన్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని టీడీపీ నేతలు […]

తాడేపల్లిగూడెంలో రెండోరోజు కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆక్రమణల తొలగింపు రెండో రోజు కొనసాగుతోంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వేంకటేశ్వరస్వామి ఆలయ భూములను ఆక్రమించి నిర్మాణాలు కడుతున్నారని ఆరోపణలు చేసిన ఆ దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం నుంచి వాటిని కూల్చేపనిలో పడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ఆక్రమణలను అడ్డుకున్న 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధర్‌తో పాటు మరో 16మందిపై ఉన్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేవాదాయ భూముల్ని ఆక్రమంగా విక్రయించారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే అక్రమ కట్టడాలపై సీఎం జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదికను మంగళవారం రాత్రి నుంచి కూల్చివేస్తోన్న విషయం తెలిసిందే.