రాజమహేంద్రవరంలో.. హైదరాబాద్ హలీం

| Edited By:

May 27, 2019 | 12:54 PM

పవిత్ర రంజాన్ సీజన్‌లో అందరికీ గుర్తొచ్చే వంటకం హలీమ్. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ మొగల్ చక్రవర్తుల వంటకం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు పాకింది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఈ వంటకానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ వంటను చేసేందుకు ప్రతి ఏడాది హైదరాబాద్ నుంచి 60మందికి పైగా తయారీదారులు రాజమండ్రికి వెళ్తున్నారు. అక్కడి ఆజాద్ చౌక్ వద్ద సుమారు 12 తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి.. నెల రోజుల పాటు నగరవాసులకు హలీమ్‌ను […]

రాజమహేంద్రవరంలో.. హైదరాబాద్ హలీం
Follow us on

పవిత్ర రంజాన్ సీజన్‌లో అందరికీ గుర్తొచ్చే వంటకం హలీమ్. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ మొగల్ చక్రవర్తుల వంటకం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు పాకింది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఈ వంటకానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ వంటను చేసేందుకు ప్రతి ఏడాది హైదరాబాద్ నుంచి 60మందికి పైగా తయారీదారులు రాజమండ్రికి వెళ్తున్నారు.

అక్కడి ఆజాద్ చౌక్ వద్ద సుమారు 12 తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి.. నెల రోజుల పాటు నగరవాసులకు హలీమ్‌ను అందిస్తున్నారు. అంతేకాదు దీనివలన ఈ మాసంలో నగరానికి చెందిన సుమారు 250మంది యువత ఉపాధి పొందుతున్నారు. అయితే ఎలాంటి రసాయనాల్లేకుండా తయారుచేసే ఈ హలీమ్, ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.