ఖమ్మం ‘మైనర్’ కేసును సుమోటాగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ

| Edited By:

Oct 07, 2020 | 11:37 AM

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్యాయత్నం సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) స్పందించింది

ఖమ్మం మైనర్ కేసును సుమోటాగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ
Follow us on

Khammam minor girl case: ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్యాయత్నం సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) స్పందించింది. వివిధ పత్రికలు, మీడియాల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ను మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చికిత్స ఎలా చేస్తారని..? కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకపోవడమేంటని హెచ్‌ఆర్సీ ప్రశ్నించింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా చికిత్స ప్రారంభించడం ఆసుపత్రి తప్పిదమని హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి వచ్చే నెల 6వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది.

Read More:

ల్యాండ్ సెటిల్‌మెంట్‌.. వ్యాపారిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి గ్యాంగ్‌ వీరంగం

మాస్‌ రాజా కూడా స్టార్ట్‌ చేసేశాడు