గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం.. కడప జిల్లాలో ఉద్రిక్తత

| Edited By:

Sep 03, 2020 | 2:16 PM

వరద ప్రభావంతో గండికోట జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో ముంపునకు గురవుతుందేమోనన్న అనుమానంతో

గండికోట జలాశయంలో పెరిగిన నీటిమట్టం.. కడప జిల్లాలో ఉద్రిక్తత
Follow us on

Thallaproddutur high tension: వరద ప్రభావంతో గండికోట జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీంతో ముంపునకు గురవుతుందేమోనన్న అనుమానంతో కడప జిల్లా కొండాపూర్‌ మండలం తాళ్లపొద్దుటూరు గ్రామాన్నీ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయమని గ్రామస్థులు చెప్పారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో తాళ్లపొద్దుటూరులో భారీగా పోలీసులు మోహరించగా.. ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులకు మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, సీపీఐ జిల్లా నాయకుడు వెంకట సుబ్బారెడ్డి. పలు కుల సంఘ నాయకులు మద్దతు తెలిపారు. మరోవైపు ముంపు బాధితులతో జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న చర్చలు జరుపుతున్నారు.

Read More:

టీమ్‌ మెంబర్‌కి కరోనా.. క్రిష్-వైష్ణవ్‌ మూవీకి బ్రేక్..!

మహేష్ ‘సర్కారు వారి పాట’ గురించి ఆసక్తికర విషయం!