హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం

|

Jun 28, 2020 | 9:28 AM

ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నంతగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తన ద్రోణికి తోడు రుతుపవనాల ఆగమనంతో మేఘాలు గర్జించాయి.

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం
Follow us on

ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నంతగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తన ద్రోణికి తోడు రుతుపవనాల ఆగమనంతో మేఘాలు గర్జించాయి. కుండపోత వాన కురవడంతో తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

శనివారం అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 10 గంటల వరకు నాంపల్లిలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వెల్లడించింది. ఈ వర్షాకాలంలో ఇదే రికార్డు. వచ్చే మూడ్రోజులు హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.