నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టు కు భారీ వరద

|

Sep 26, 2020 | 3:44 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మరో 24 గంటల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టు కు భారీ వరద
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మరో 24 గంటల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో వ‌ర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌తో సాగునీటి ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో జ‌లాశ‌యాల‌న్నీ నీటితో తొణికిస‌లాడుతున్నాయి. మక్తల్ మండలం సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టుకు వ‌ర‌ద కొన‌సాగుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు.. 10 గేట్లు పూర్తిగా ఎత్తివేత దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.

ఇన్ ఫ్లో : 70,000 క్యూసెక్కులు

ఓట్ ఫ్లో : 70,000 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం : 3.3 టీఎంసీలు

ప్రస్తుత నీటి మట్టం : 2.60 టీఎంసీలు