బిరబిరా కృష్ణమ్మ…సాగర్ పొటెత్తిన వరద

|

Aug 26, 2020 | 4:06 PM

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో కలిసేందుకు బిరబిరా పరుగులెడుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యామ్‌లోని 12 క్రస్ట్‌ గేట్ల...

బిరబిరా కృష్ణమ్మ...సాగర్ పొటెత్తిన వరద
Follow us on

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో కలిసేందుకు బిరబిరా పరుగులెడుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యామ్‌లోని 12 క్రస్ట్‌ గేట్లలో 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తేశారు అధికారులు. డ్యామ్‌ 7 గేట్లు ఎత్తేయడం ద్వారా 1,95,881 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. అవి నాగార్జునసాగర్‌కు వెళ్తున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా… ప్రస్తుతం 884.80 అడుగులమేర నీరు ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 2,27,880 క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో 2,26,545 క్యూసెక్కులుగా నమోదైంది. కాగా, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 30, 664 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.