ఉత్తమ్‌పై మండిపడ్డ మంత్రి హరీష్ రావు..

| Edited By:

Jul 07, 2020 | 7:26 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలకు టీఆర్‌ఎస్ నేతలు వరుసగా సమాధానం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తమ్‌పై మండిపడ్డ మంత్రి హరీష్ రావు..
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలకు టీఆర్‌ఎస్ నేతలు వరుసగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే సచివాలయ కూల్చివేతపై కాంగ్రెస్ నేతల ఆరోపణలపై మంత్రి జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా సమాధానం చెప్పారు. కాగా, ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిన నిలదీస్తూ సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ నగరంపై ఆంధ్రా పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.

‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెత్తనం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆంధ్రప్రదేశ్ సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతున్నట్లు కనబడుతున్నది’’ అంటూ మంత్రి హరీష్ రావు తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.