గుంటుపల్లి బౌద్ధ గుహలు మూసివేత

| Edited By:

Mar 02, 2019 | 8:29 AM

ప్రముఖ గుంటుపల్లి బౌద్ధ గుహలు మూతపడ్డాయి. గత నెల 24న శ్రీధరణి హత్య అనంతరం గుంటుపల్లి బౌద్ధ గుహల సందర్శనను అధికారులు నిలిపివేశారు. హత్య కేసులో ఆధారాల కోసం పర్యాటకుల సందర్శనను ఆపేశారు. సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తే రద్దీ పెరగడంతో పాటు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుహలను మూసివేసినట్లు సిబ్బంది తెలిపారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు సందర్శనకు అనుమతించమని వారు చెప్పారు. కాగా ఆధారాల కోసం క్లూస్ టీమ్‌తో […]

గుంటుపల్లి బౌద్ధ గుహలు మూసివేత
Follow us on

ప్రముఖ గుంటుపల్లి బౌద్ధ గుహలు మూతపడ్డాయి. గత నెల 24న శ్రీధరణి హత్య అనంతరం గుంటుపల్లి బౌద్ధ గుహల సందర్శనను అధికారులు నిలిపివేశారు. హత్య కేసులో ఆధారాల కోసం పర్యాటకుల సందర్శనను ఆపేశారు. సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తే రద్దీ పెరగడంతో పాటు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుహలను మూసివేసినట్లు సిబ్బంది తెలిపారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు సందర్శనకు అనుమతించమని వారు చెప్పారు. కాగా ఆధారాల కోసం క్లూస్ టీమ్‌తో పాటు మహిళా కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు ప్రతిదినం ఈ ప్రాంతానికి వెళ్తున్నారు.