అక్కడి మొక్కలు తిన్న మేకలకు రూ. 45000 జరిమానా..!

|

Jul 28, 2020 | 10:52 AM

హరితహరం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. గత ఆరేళ్లుగా సాగుతున్న హరితహరం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాలలో మొక్కలు నాటిన సంగతి తెల్సిందే. అలాగే నాటిన ప్రతి మొక్క..

అక్కడి మొక్కలు తిన్న మేకలకు రూ. 45000 జరిమానా..!
Follow us on

హరితహరం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. గత ఆరేళ్లుగా సాగుతున్న హరితహరం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల కొద్ది మొక్కలు నాటిన సంగతి తెల్సిందే. అలాగే నాటిన ప్రతి మొక్క మహా వృక్షంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాటిన మొక్కలను ఎవరైనా తొలగిస్తే వారికి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా ఉంటాయని నిబంధనలు అమలు చేస్తోంది. అయితే,  ఖమ్మం జిల్లాలో హరితహరం మొక్కలను మేకలు తినేశాయి. దీంతో ఆ మేకల యజమానికి భారీగా జరిమానా విధించారు స్థానిక అధికారులు.

ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్‌ మెయిన్‌ రోడ్‌లో హరితహరం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటారు. అయితే, కొన్ని మేకలు డివైడర్‌ పైనున్న మొక్కలను తినేశాయి. అది గమనించిన మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి సిబ్బందిని పిలిపించి ఆ మేకలను వెంటనే బంధించాల్సిందిగా ఆదేశించారు. సిబ్బంది వెంటనే అక్కడున్న 9 మేకలను బంధించారు. మున్సిపల్‌ యాక్ట్‌ 2019 ప్రకారం ఒక్కో మేకకు రూ.5000 జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఆ మేకల యజమాని ఎవరో విషయం తెలుసుకొని మున్సిపల్‌ ఆఫీస్ కి వచ్చి జరిమానా కట్టి తీసుకు వెళ్ళాలని తెలిపారు. లేదంటే వాటిని వేలం పాట వేస్తామని హెచ్చరించారు.