మంచిర్యాలలో వైభవంగా గాంధారి ఖిలా జాతర

| Edited By:

Feb 25, 2019 | 11:09 AM

మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిలా జాతర వైభవంగా సాగుతోంది. మందమర్రి మండలం బొక్కలగుట్టలో ఉన్న ఆలయాన్ని వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు వస్తూంటారు. నాయక్పోడ్ గిరిజనులు జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా.. చెన్నూరు శాసన సభ్యుడు బాల్కసుమన్ జాతరకు హాజరయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం జరిగిన ప్రజా దర్బారులో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి […]

మంచిర్యాలలో వైభవంగా గాంధారి ఖిలా జాతర
Follow us on

మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిలా జాతర వైభవంగా సాగుతోంది. మందమర్రి మండలం బొక్కలగుట్టలో ఉన్న ఆలయాన్ని వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు వస్తూంటారు. నాయక్పోడ్ గిరిజనులు జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా.. చెన్నూరు శాసన సభ్యుడు బాల్కసుమన్ జాతరకు హాజరయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం జరిగిన ప్రజా దర్బారులో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాంధారి ఖిలా జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే కోటి ఇరవై లక్షల రూపాయలతో జాతర ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు, అంతేకాకుండా.. రోడ్, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బాల్కసుమన్.