Big Breaking News : ఫార్మాసిటీలో గ్యాస్ లీక్… ఇద్దరు మృతి

|

Jun 30, 2020 | 10:06 AM

విశాఖ ఫార్మసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని సాయినాథ్ ఆఫ్ సైన్సెస్ కంపెనీలో ఈ తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్కడిక్కడే మృతి చెందారు...

Big Breaking News : ఫార్మాసిటీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి
Follow us on

Gas Leak in Visakhapatnam : విశాఖలో స్టైరీన్‌ ఘటన మరిచిపోక ముందే మరో ఘటన విషాదాన్ని నింపింది. పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్‌ కావడంతో ఇద్దరు మృతి చెందారు. సాయినాథ్ ఆఫ్‌ సైన్సెస్‌ కంపెనీలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను షిప్ట్‌ ఇంచార్జి నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని చంద్రశేఖర్‌, అనంద్‌బాబు, జానకీరామ్‌, సూర్యనారాయణగా గుర్తించారు. హెల్పర్‌ చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లీకైన గ్యాస్‌ను బెంజిమెడిజోల్‌ వేపర్‌గా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి కలెక్టర్ వినయ్ చంద్ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించించారు. కలెక్టర్ తోపాటు ఏడీసీపీ సురేష్ బాబు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

ఏమి జరుగుతుందనే భయంతో విశాఖవాసులు వణికిపోతున్నారు. ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది దాక మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా కళ్ల ముందే…మెదులుతుండగా..మరో గ్యాస్ లీక్ కావడంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.