నేత‌న్న‌ల‌కు చేతినిండా ప‌నిః కేటీఆర్‌

|

May 11, 2020 | 4:43 PM

చేనేత‌కు మంచి రోజులు రాబోతున్నాయ‌ని పుర‌పాల‌క‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేతకు ఢోకా లేకుండా, కార్మికులకు చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నామని స్ప‌ష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బ్దదెనపల్లి లోని టెక్సటైల్స్‌ పార్క్‌లో పలు అభివృద్ది పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సెంట్రల్‌ లైటింగ్‌, పరిపాలన భవనం, కార్మికుల భోజనశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశంలోనే […]

నేత‌న్న‌ల‌కు చేతినిండా ప‌నిః కేటీఆర్‌
Follow us on
చేనేత‌కు మంచి రోజులు రాబోతున్నాయ‌ని పుర‌పాల‌క‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేతకు ఢోకా లేకుండా, కార్మికులకు చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నామని స్ప‌ష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బ్దదెనపల్లి లోని టెక్సటైల్స్‌ పార్క్‌లో పలు అభివృద్ది పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సెంట్రల్‌ లైటింగ్‌, పరిపాలన భవనం, కార్మికుల భోజనశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్ ను‌ వరంగల్‌, సిరిసిల్లలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిపారు. తంగళ్లపల్లి మండలంలో    రూ.14.50 కోట్ల తో టెక్స్ టైల్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో కార్మికులకు అండగా ఉంటామన్నారు. కంపెనీల యజమానులు కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. కార్మికులు స‌హ‌నం కొల్పోవ‌ద్ద‌ని, చేనేత కార్మికులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా చేయూత‌ను అందిస్తామని మంత్రి కేటీఆర్ భ‌రోసానిచ్చారు.