వారి కన్ను పడిందా అంతే.. శ్రీధరణి కేసులో విస్తుపోయే నిజాలు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:38 PM

ఏపీలో సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు అంకమరావుతో సహా నలుగురి అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిని విచారించిన పోలీసులు నివ్వెరపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ గ్యాంగ్ ఏకంగా 32 అత్యాచారాలు, నాలుగు హత్యలు చేసినట్లు తేలింది. కృష్ణాజిల్లా చంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరు అంకమరావు అలియాస్ రాజు నూజివీడు మైలవరం ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాపలాగా ఉంటాడు. ఈ సమయంలో ఇబ్రహీంపట్నం, నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో చదువుకునే యువతీ, […]

వారి కన్ను పడిందా అంతే.. శ్రీధరణి కేసులో విస్తుపోయే నిజాలు
Follow us on

ఏపీలో సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు అంకమరావుతో సహా నలుగురి అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిని విచారించిన పోలీసులు నివ్వెరపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ గ్యాంగ్ ఏకంగా 32 అత్యాచారాలు, నాలుగు హత్యలు చేసినట్లు తేలింది.

కృష్ణాజిల్లా చంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరు అంకమరావు అలియాస్ రాజు నూజివీడు మైలవరం ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాపలాగా ఉంటాడు. ఈ సమయంలో ఇబ్రహీంపట్నం, నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో చదువుకునే యువతీ, యువకులు తోటల్లోకి వచ్చి ఏకాంతంగా గడపడం గమనించేవాడు. 2017 తరువాత నేరాలు చేయడానికి అలవాటు పడ్డాడు. మామిడి తోటలోకి వచ్చిన జంటలపై దాడి చేసి యువకులను గాయపరిచి.. యువతులపై అత్యాచారం చేసేవాడు. వరుసగా ఇలాంటి నేరాలు చేసిన ఫిర్యాదులు రాకపోవడంతో తన సమీప బంధువులైన తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వీరందరూ ప్రతి పది రోజులకు ఓ నేరం చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 24న గుంటుపల్లి గుహలు చూసేందుకు వచ్చిన శ్రీధరణి, నవీన్‌లపై వీరు దాడి చేశారు. నవీన్‌ తలపై బలంగా కొట్టి, శ్రీధరణిపై అత్యాచారం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి నిందితులు పారిపోతూ సెల్‌ఫోన్‌ను, సిమ్‌లను ముక్కలు ముక్కలు చేసి పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు అనేక ఆటంకాలు కలిగాయి. చివరకు సెల్‌టవర్ ట్రాక్ చేసి, వేటగాళ్ల వివరాలను సేకరించడంతో అంకమరావు గ్యాంగ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో మొత్తం 32 నేరాలు చేసినట్లు ఈ గ్యాంగ్ అంగీకరించింది. దీనిపై జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ.. త్వరలోనే అంకమరావు గ్యాంగ్‌పై ఉన్న కేసులను విచారిస్తామని తెలిపారు.