కోవిడ్ ఆసుపత్రుల్లోని పడకల వివరాలు ప్రదర్శించండి

| Edited By:

Jul 31, 2020 | 4:53 PM

ప్రతి జిల్లాలో కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఉన్న పడకల ఖాళీలు, భర్తీ వివరాలను ప్రదర్శించాలని సీఎం జగన్‌ సూచించారు.

కోవిడ్ ఆసుపత్రుల్లోని పడకల వివరాలు ప్రదర్శించండి
Follow us on

CM Jagan Review on Corona: ప్రతి జిల్లాలో కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఉన్న పడకల ఖాళీలు, భర్తీ వివరాలను ప్రదర్శించాలని సీఎం జగన్‌ సూచించారు. కరోనా నివారణ చర్యలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసుపత్రి హెల్ప్‌లైన్ నంబర్ సహా పడకల ఖాళీ వివరాలు బ్లాక్‌బోర్టుపై రాయాలని అన్నారు. ఎవరికైనా బెడ్‌లు అందుబాటులో లేదంటే సమీప ఆసుపత్రిలో బెడ్‌ కేటాయించాలని పేర్కొన్నారు. రోగులకు బెడ్‌ దొరకలేదనే పరిస్థితి ఉండకూడదని వివరించారు. హెల్ప్‌ డెస్క్‌లో ఆరోగ్య మిత్రలను ఉంచాలని జగన్ సూచించారు.

కరోనా కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల యాజమాన్యంపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. సూక్ష్మ స్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, హెల్ప్ డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయని అన్నారు. బెడ్లు, ఆహారం, శానిటైజేషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇక కరోనాపై అవగాహన కల్పించడానికి సంయుక్త కలెక్టర్‌ విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

Read This Story Also: కరోనా బాధితుల కోసం.. మళ్లీ వైద్య వృత్తి చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే