నవంబర్ 2 నుంచి ఏపీలో డిగ్రీ, పీజీ తరగతులు.. మార్గదర్శకాలివే

| Edited By:

Oct 31, 2020 | 8:15 AM

వచ్చే నెల రెండో తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూనినర్శిటీలు, కాలేజీల్లో తీసుకోవాల్సిన కరోనా

నవంబర్ 2 నుంచి ఏపీలో డిగ్రీ, పీజీ తరగతులు.. మార్గదర్శకాలివే
Follow us on

AP Degree Colleges start: వచ్చే నెల రెండో తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూనినర్శిటీలు, కాలేజీల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే యూనివర్శీటీలకు, కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్‌ని విడుదల చేశారు.(Bigg Boss 4: బిగ్‌బాస్@55డేస్‌.. కంటెస్టెంట్లు ఎమోషనల్‌)

మార్గదర్శకాలివే:
1.వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలి.
2. ఏ రోజైనా పని దినాల్లో సెలవు ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా రెండో శనివారాలు, ఆదివారాల్లో క్లాసులు నిర్వహించాలి.
3. క్లాస్ రూమ్స్, క్యాంటీన్లు, జిమ్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి.
4.హాస్టళ్లల్లోనూ కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు తీసుకోవాలి.
5. హాస్టళ్లలో ఒకటో వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలి.
6. కామన్ హాల్స్, టీవీ హాళ్లను వసతి కోసం వివియోగించుకోవాలి.

(Bigg Boss 4: ఇష్టమైన బొమ్మను తిరిగిచ్చిన బిగ్‌బాస్‌.. ఏడ్చేసిన అరియానా)