కావాలనే నా కుమారుడిని ఇరికించారు: ఉరిశిక్షపై దోషి రఫీ తండ్రి

| Edited By:

Feb 25, 2020 | 6:41 PM

చిత్తూరులో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన కేసులో మహ్మద్ రఫీని దోషిగా తేలుస్తూ చిత్తూరు మొదటి అదనపు కోర్టు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని చిన్నారి తల్లి అన్నారు.

కావాలనే నా కుమారుడిని ఇరికించారు: ఉరిశిక్షపై దోషి రఫీ తండ్రి
Follow us on

చిత్తూరులో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన కేసులో మహ్మద్ రఫీని దోషిగా తేలుస్తూ చిత్తూరు మొదటి అదనపు కోర్టు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని చిన్నారి తల్లి అన్నారు. మరోవైపు ఈ తీర్పుపై మహ్మద్ రఫీ తల్లిదండ్రులు స్పందించారు.

తమ కుమారుడు అమాయకుడని రఫీ తండ్రి పఠాన్‌వలీ పేర్కొన్నారు. పోలీసులు ఉరిశిక్ష వేయించామని చెప్పుకోవడానికే తమ కుమారుడిని బలి చేశారని ఆయన ఆరోపించారు. రఫీకి వ్యతిరేకంగా సాక్ష్యాలే లేవని చెప్పుకొచ్చారు. ఈ ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి తనకు లాయర్‌ను పెట్టుకునే స్థోమత కూడా లేదని ఆయన అన్నారు. తమ కుమారుడిని చూసేందుకు జైలుకు వెళ్లాలని అనుకుంటే, తనను కూడా అరెస్ట్ చేస్తారని గ్రామస్తులు చెబుతున్నారని పఠాన్ వలీ పేర్కొన్నారు. అసలు నిందితులను పట్టుకోవడం చేతకాక.. రఫీని పట్టుకొని సమాజం ముందు దోషిగా చూపిస్తున్నారని.. డబ్బున్నోళ్లకు ఓ న్యాయం, లేనోళ్లకు మరో న్యాయమా..? అని ఆయన ప్రశ్నించారు.

Read This Story Also: చిత్తూరు చిన్నారి హత్యాచారం కేసు.. దోషికి ఉరిశిక్ష..!