Covid 19: పోర్టుకు వచ్చిన చైనా షిప్.. విశాఖలో టెన్షన్ టెన్షన్..!

| Edited By:

Mar 06, 2020 | 12:35 PM

భారత్‌లోనూ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 30మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. వందల మంది అనుమానితులుగా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకుంది.

Covid 19: పోర్టుకు వచ్చిన చైనా షిప్.. విశాఖలో టెన్షన్ టెన్షన్..!
Follow us on

భారత్‌లోనూ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 30మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. వందల మంది అనుమానితులుగా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకుంది. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా.. ఏపీలో ఇంతవరకు కరోనా కేసు నమోదు కాలేదు. అయితే ఇప్పుడు విశాఖవాసులను చైనాకు చెందిన ఓ షిప్ భయపెట్టిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫార్చ్యూన్ హీరో అనే కార్గో షిప్.. గురువారం విశాఖ తీరానికి చేరుకుంది. షిప్‌లో మొత్తం 22మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17మంది చైనీయులు, ఐదుగురు మయన్మార్ వాసులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆ షిప్‌ను పోర్టుకు దూరంగా అధికారులు నిలిపివేశారు. అక్కడే షిప్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ షిప్‌ విశాఖ పోర్టుకు చేరుకునేందుకు నెల రోజుల క్రితమే ఒడిశాకు చెందిన స్టివిడోస్ కంపెనీ అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. కాగా కరోనా బాధితుల సంఖ్య 98,382కు చేరగా.. 3,383 మంది మృత్యువాతపడ్డారు.

Read This Story Also: శిల్పాశెట్టి దంపతులకు షాక్.. పోలీసులకు ఫిర్యాదు