కరోనా మరణాల రేటు అధికంగా ఉన్న జిల్లాలు.. లిస్ట్‌లో హైదరాబాద్‌, మేడ్చల్‌

| Edited By:

Aug 09, 2020 | 4:09 PM

పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో పాటు మరణాల శాతం కూడా తక్కువగా ఉంది.

కరోనా మరణాల రేటు అధికంగా ఉన్న జిల్లాలు.. లిస్ట్‌లో హైదరాబాద్‌, మేడ్చల్‌
Follow us on

Covid 19 deaths India: పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో పాటు మరణాల శాతం కూడా తక్కువగా ఉంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా మరణాలు అధికంగా ఉన్న జిల్లాల లిస్ట్‌లో రాష్ట్రంలోని హైదరాబాద్‌, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 16 జిల్లాల్లో కరోనా మరణాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో అధిక సంఖ్యలో యాక్టివ్‌ కేసులు ఉండటంతో పాటు రోజువారి కేసులు కూడా పెరుగుతున్నాయని, అలాగే టెస్ట్‌ల సంఖ్య తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌.. కర్ణాకటలోని బెలగావి, బెంగళూరు అర్బన్‌, కలబురగి, ఉడిపి.. తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, రాణి పేట్‌, తెని, తిరువల్లూర్‌, తిరుచిరాపల్లి, తుటికోరిన్‌, విద్యానగర్‌.. తెలంగాణలోని హైదరాబాద్‌, మేడ్చల్ జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాల రేటు ఉండటం ఆందోళనను కలిగిస్తోంది అని మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులతో హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల్లో కరోనా మరణాలను ఎలా తగ్గించాలన్న దానిపై ఆయన చర్చించారు.

Read This Story Also: మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్న సోము వీర్రాజు