బ్రేకింగ్: వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్

| Edited By:

Jun 27, 2019 | 4:25 PM

ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు పులివెందుల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఇన్నిరోజులుగా నిందితులు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది మార్చి 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత […]

బ్రేకింగ్: వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్
Follow us on

ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు పులివెందుల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఇన్నిరోజులుగా నిందితులు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది మార్చి 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత ఆయన గుండెపోటుతో మరణించారని అనుకున్నా.. పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా తేలింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వివేకా కుమార్తె సునీత కోరుతున్నారు. దీనిపై ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన ఆమె.. గంటకు పైగా చర్చించారు.