లాక్‌డౌన్‌ వేళ పోలీసుల అత్యుత్సాహం.. బ్రిడ్జిపై అవస్థలు పడుతున్న రోగులు

| Edited By:

Apr 30, 2020 | 4:04 PM

కరోనా లాక్‌డౌన్‌ వేళ కొన్ని ప్రదేశాల్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద పోలీసుల రెచ్చిపోయారు.

లాక్‌డౌన్‌ వేళ పోలీసుల అత్యుత్సాహం.. బ్రిడ్జిపై అవస్థలు పడుతున్న రోగులు
Follow us on

కరోనా లాక్‌డౌన్‌ వేళ కొన్ని ప్రదేశాల్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద పోలీసుల రెచ్చిపోయారు. హార్ట్ పేషెంట్లు, గర్భిణీలు అత్యవసర సేవల నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి వెళుతుండగా వాహనాలను నిలిపివేశారు. దీంతో గామన్ బ్రిడ్జి పై మండుటెండలో రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రోగులకు మధ్య వాగ్వివాదం జరిగింది. కాగా ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు అక్కడి పోలీసులు. అత్యవసరం అయితే తప్ప బయటికి రానివ్వడం లేదు. పనిలేకున్నా సాకు చెప్పి బయటకు వస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరికొన్ని ప్రదేశాల్లో వినూత్న పనిష్మెంట్లు ఇస్తున్నారు.

Read This Story Also: ఇద్దరు లెజండ్స్‌ కలిసి నటించిన ఏకైక చిత్రమిదే..!