ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ ‘తెలంగాణ లాక్‌డౌన్’

| Edited By:

Mar 22, 2020 | 7:48 PM

మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు..

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్
Follow us on

మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి అద్భుత స్పందన వచ్చిందన వచ్చిందన్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సంఘీభావ సంకేతం కూడా విజయవంతమైంది.

కాగా కొత్తగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 26 పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆయన తెలిపారు. అయితే వీరు విదేశీయులని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏవిధంగా బాధ్యతాయుధంగా కర్ఫ్యూని పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ ఈ విధంగానే ఇంట్లో ఉండాలని కోరారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. కాగా.. మీకు కావాల్సిన నిత్యవసర సరుకులు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే రేషన్ సరుకులు, మెడిసిన్, కూరగాయలు, పాలు లభ్యమవుతాయన్నారు. మన స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు కేసీఆర్.

అలాగే అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.. మిగతా ప్రభుత్వం ఉద్యోగులు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే లేబర్స్‌ని కూడా ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే రేషన్ కార్డ్ ఉన్న ప్రతీ వ్యక్తి 12 కేజీల బియ్యంతో పాటు.. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి రూ.1500లను ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే ఆటోలు, బస్సులు కూడా బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read more also:

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

 కరోనా సోకిన వారిలో చనిపోయే ఛాన్స్ ఎక్కువగా పురుషులకే ఉందట..