ఏపీలో ఇవాళ్టి నుంచి రోడెక్కనున్న సిటీ బస్సులు

| Edited By:

Sep 19, 2020 | 9:42 AM

కరోనా నేపథ్యంలో ఏపీలో గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితం అయిన సిటీ బస్సులు ఇవాళ రోడెక్కనున్నాయి. తొలి దశలో విజయవాడలో

ఏపీలో ఇవాళ్టి నుంచి రోడెక్కనున్న సిటీ బస్సులు
Follow us on

Vijayawada City buses: కరోనా నేపథ్యంలో ఏపీలో గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితం అయిన సిటీ బస్సులు ఇవాళ రోడెక్కనున్నాయి. తొలి దశలో విజయవాడలో వంద బస్సులను ఆర్టీసీ తిప్పనుంది. అందులో 60 శాతం ప్రయాణికులకు అనుమతిని ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచి 26 వరకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరగనుండగా.. ముందుగా వారి కోసం బస్సులను నడపనున్నారు. 26 తరువాత ప్రయాణికుల డిమాండ్‌కి అనుగుణంగా బస్సు సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ ఆధారంగా రేపటి నుంచి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇక బస్సులో సిట్టింగ్‌కి సరిపడిన ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నారు. అన్ని సీట్లలో ఒక్కొక్కరు కూర్చున్నాక పక్కన మరొకరిని కూర్చునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే మాస్కులు ఉంటేనే బస్సులోకి ప్రయాణికులను అనుమతించనున్నారు.

Read More:

Bigg Boss 4: ఉన్నట్లుండి నోయల్‌కి ఏమైంది.. ఇవాళ నాగ్‌తో బయటపెడతాడా..!

తిరిగి ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు