పొలాల్లో దిగిన చాపర్.. ఎట్టకేలకు గాల్లోకి..!

| Edited By:

Feb 19, 2020 | 11:54 AM

సాంకేతిక సమస్యల కారణంగా రెండు రోజుల క్రితం అనంతపురం పంట పొలాల్లోకి దిగిన చాపర్.. ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. మైసూర్ నుంచి జిందాల్ వెళ్లే చాపర్ బ్రహ్మసముద్రం సమీపంలో ల్యాండింగ్ అవ్వగా.. 24గంటల పాటు శ్రమించిన ఇంజనీర్లు మరమ్మతులు చేశారు. చాపర్ ఎగరడానికి ప్రత్యేకంగా పంట పొలాల్లో కొత్త రన్‌వేను నిర్మించారు. ఇలా పలువురి సమిష్టి కృషితో ఇవాళ చాపర్ గాల్లోకి ఎగిరింది. అయితే కర్ణాటక బళ్లారిలోని జిందాల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పరంజిత్, పైలెట్ పాఠక్‌లు ఈ […]

పొలాల్లో దిగిన చాపర్.. ఎట్టకేలకు గాల్లోకి..!
Follow us on

సాంకేతిక సమస్యల కారణంగా రెండు రోజుల క్రితం అనంతపురం పంట పొలాల్లోకి దిగిన చాపర్.. ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. మైసూర్ నుంచి జిందాల్ వెళ్లే చాపర్ బ్రహ్మసముద్రం సమీపంలో ల్యాండింగ్ అవ్వగా.. 24గంటల పాటు శ్రమించిన ఇంజనీర్లు మరమ్మతులు చేశారు. చాపర్ ఎగరడానికి ప్రత్యేకంగా పంట పొలాల్లో కొత్త రన్‌వేను నిర్మించారు. ఇలా పలువురి సమిష్టి కృషితో ఇవాళ చాపర్ గాల్లోకి ఎగిరింది.

అయితే కర్ణాటక బళ్లారిలోని జిందాల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పరంజిత్, పైలెట్ పాఠక్‌లు ఈ చాపర్‌లో సోమవారం ఉదయం మైసూరుకు బయల్దేరారు. ఇంజిన్‌లో ఇంధనం లీక్ అవ్వడాన్ని గుర్తించిన పైలెట్ బ్రహ్మసముద్రం సమీపంలోని పంటపొలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు.