మెదక్ జిల్లాలో చిరుత హల్‌చల్…బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 7:34 PM

హాయిగా అడవుల్లో సంచరించాల్సిన చిరుత పులులు జనారణ్యంలో ప్రవేశించి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న హైదరాబాద్, నేడు నల్గొండ, తాజగా, మెదక్ జిల్లాలో చిరుత పులి హల్‌చల్ చేసింది. ఓ గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిన

మెదక్ జిల్లాలో చిరుత హల్‌చల్...బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు
Follow us on

హాయిగా అడవుల్లో సంచరించాల్సిన చిరుత పులులు జనారణ్యంలో ప్రవేశించి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న హైదరాబాద్, నేడు నల్గొండ, తాజగా, మెదక్ జిల్లాలో చిరుత పులి హల్‌చల్ చేసింది. ఓ గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితుల వివరాల మేరకు..

మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండల్ గ్రామ శివారులో చిరుతపులి స్థానికుల్ని హడలెత్తించింది. తొనిగండల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సూరన్న గారి భూపాల్‌కు గ్రామ శివారులో తన గొర్రెల మందకు కొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన జీవాలను కొట్టంలో ఉంచి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున కొట్టంలోకి వెళ్లి చూడగా ఓ గొర్రె చనిపోయి ఉండగా మరో రెండు గొర్లు కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వెంటనే గ్రామస్తులకు తన గొడు వెల్లబోసుకున్నాడు. గ్రామ సర్పంచ్ విషయం చెప్పగా, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గత ఎనిమిది నెలలుగా రాని చిరుత మళ్లీ గ్రామ శివారుకు వచ్చి పశువులపై దాడులు చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.