మద్యంపై బిజెపి నజర్.. ఏంచేయబోతున్నారంటే?

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2019 | 4:10 PM

తెలంగాణలో పెరుగుతున్న నేరాలకు మద్యానికి లింకుందంటున్న తెలంగాణ బిజెపి నేతలు పెద్ద ప్రణాళికతో భారీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నేరాలకు మరీ ముఖ్యంగా అత్యాచార ఘటనలకు, హత్యలకు ప్రధాన కారణం లిక్కర్ సేవనం పెరిగిపోవడమేనని కమల నాథులు భావిస్తున్నారు. దాంతో ఈ అంశంపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఉద్యమానికి బిజెపి నేతలు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఆరో పెద్ద నగరంగా భాసిల్లుతోంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు విస్తృతంగా రావడం, […]

మద్యంపై బిజెపి నజర్.. ఏంచేయబోతున్నారంటే?
Follow us on

తెలంగాణలో పెరుగుతున్న నేరాలకు మద్యానికి లింకుందంటున్న తెలంగాణ బిజెపి నేతలు పెద్ద ప్రణాళికతో భారీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నేరాలకు మరీ ముఖ్యంగా అత్యాచార ఘటనలకు, హత్యలకు ప్రధాన కారణం లిక్కర్ సేవనం పెరిగిపోవడమేనని కమల నాథులు భావిస్తున్నారు. దాంతో ఈ అంశంపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఉద్యమానికి బిజెపి నేతలు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఆరో పెద్ద నగరంగా భాసిల్లుతోంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు విస్తృతంగా రావడం, ఐటి కంపెనీలు పెద్ద ఎత్తున తమ బ్రాంచీలను ఇక్కడ నెలకొల్పడం.. హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేశాయి. అది పాశ్చత్య సంస్కృతిని పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు మోసుకొచ్చింది. మరోవైపు తెలంగాణవ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు భారీగా స్థాయిలో పెరిగిపోయాయి.

రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం మద్యం సేవించి వున్నప్పుడే జరుగుతున్నట్లుగా నివేదికలున్నాయి. అత్యాచార ఘటనలకు చాలా సందర్భాలలో మద్య సేవనమే కారణమవుతుందని తెలుస్తోంది. తాజాగా వెలుగు చూసిన నేరాల్లో ఇదే ట్రెండ్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి నేతలు ఓ నివేదిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో మద్య నిషేధాన్ని విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించాలని కమల నాథులు భావిస్తున్నారు. తాము మద్య నిషేధ ఉద్యమం ప్రారంభిస్తే.. మహిళలు పెద్ద ఎత్తున కదలివస్తారని కమల నాథులు అంఛనా వేస్తున్నారు. ఇప్పటికే మోదీ చరిస్మాతో చాలా మటుకు పార్టీ గ్రౌండ్ లెవల్‌కు విస్తరించిందని, దానికి మహిళలు కూడా తోడైతే పార్టీ మరింతగా పెరుగుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. మహిళలను ఆకర్షించడానికి మద్య నిషేధ ఉద్యమం పెద్ద ఎత్తున దోహదపడుతుందన్నది కమల నాథులు వ్యూహంగా తెలుస్తోంది. మరి ముహూర్తమెప్పుడు బిజెపి నాయకత్వమే వెల్లడించాలి.