కరోనా ఎఫెక్ట్‌: టికెట్ల జారీ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమం

| Edited By:

Jul 09, 2020 | 1:29 PM

కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ సేవల్లో పలు మార్పులు చేసిన ఏపీ.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది

కరోనా ఎఫెక్ట్‌: టికెట్ల జారీ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమం
Follow us on

కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ సేవల్లో పలు మార్పులు చేసిన ఏపీ.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రథమ్ మొబైల్‌ యాప్‌ను తీసుకురాబోతున్న ఆర్టీసీ.. ఆ నెల 20 నుంచి ఈ యాప్ ద్వారానే టికెట్లను జారీ చేయబోతోంది. ఈ క్రమంలో తొలి దశలో ప్రయోగాత్మకంగా 19 డిపోల పరిధిలో మొబైల్ యాప్‌ ద్వారా టికెట్లను జారీ చేయాలని ఎండీ నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం-1, కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, రావుల పాలెం, నెల్లూరు -1, చిత్తూరు-2, తిరుపతి, కర్నూలు-1, తాడిపత్రి, గుంటూరు -2 డిపోల్లో ఈ యాప్‌ ద్వారా టికెట్లను జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా కండక్టర్లు, డ్రైవర్లు ప్రత్యేక మొబైల్ సమకూర్చుకోవాలని ఎండీ ఆదేశించారు. సూచించిన ప్రమాణాల మేరకు సిబ్బంది స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకోవాలని.. యాప్ సహా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ఆర్టీసీ అందిస్తుందని ఎండీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఈడీలు, అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు.