YS viveka case: వివేకా హత్య కేసు విచారణ.. మరోసారి వాయిదా

| Edited By:

Feb 13, 2020 | 6:35 PM

YS viveka case: సీఎం జగన్ చిన్నాన్న, దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర పోలీసులు సమర్థంగా వ్యవహరించలేదని.. ఈ కేసులో ఇద్దరు కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేశారని.. […]

YS viveka case: వివేకా హత్య కేసు విచారణ.. మరోసారి వాయిదా
Follow us on

YS viveka case: సీఎం జగన్ చిన్నాన్న, దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర పోలీసులు సమర్థంగా వ్యవహరించలేదని.. ఈ కేసులో ఇద్దరు కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేశారని.. అందుకే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే హైకోర్టులో ఇవాళ అడ్వొకేట్ జనరల్(ఏజీ) లేకపోవడంతో తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేశారు.

అయితే గత ఏడాది మార్చి 15న పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్ వివేకానంద దారుణ హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత పోస్ట్‌మార్టంలో వివేకాది హత్య అని తేలింది. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మరో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఈ కేసులో నిందితులెవరో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ అప్పట్లో పిటిషన్ వేసిన జగన్.. ఆ తరువాత ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ హత్య రాజకీయాల్లో కలకలం సృష్టించగా.. ఇప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.