ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యంః డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

|

May 14, 2020 | 11:56 AM

ఏపీ డీఎస్సీ- 2008 అభ్య‌ర్థుల‌కు క‌నీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుక ఆర్థిశాఖ ఆమోదించింది.

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యంః డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..
Follow us on

అధికారంలోకి వ‌చ్చాక న‌వ‌ర‌త్నాల అమ‌లులో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దూసుకుపోతున్నారు. అతి త‌క్కువ కాలంలోనే అనేక ర‌కాల ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ త‌న మార్క్ చూపెడుతున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌నిచ్చేలా సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

 

ఏపీ డీఎస్సీ- 2008 అభ్య‌ర్థుల‌కు క‌నీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిశాఖ ఆమోదించింది. డీఎస్సీ -2008లో సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ల పోస్టుల‌కు మొద‌ట డీఎడ్ వారికే అవ‌కాశం ఇవ్వ‌గా,.. త‌మ‌కు కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని బీఎడ్ విద్యార్థులు కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో డీఎడ్ వాళ్ల‌కు 30శాతం పోస్టులే కేటాయించ‌గా.. దీని వ‌ల్ల మొద‌ట పోస్టులు వ‌చ్చిన డీఎడ్ అభ్య‌ర్థులు పోస్టు కోల్పోవాల్సి వ‌చ్చింది. దీంతో వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వ‌నున్నారు.