ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత..!

| Edited By:

Sep 06, 2020 | 1:19 PM

కరోనా సోకి కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి కోలుకున్న వారికి ఆసరా కింద ఏపీ ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయాన్ని ఇచ్చే విషయం తెలిసిందే.

ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత..!
Follow us on

Financial Assistance Covid patients: కరోనా సోకి కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి కోలుకున్న వారికి ఆసరా కింద ఏపీ ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయాన్ని ఇచ్చే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాయాన్ని ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదని సమాచారం.

అయితే కరోనా‌ నుంచి కోలుకున్న వారు 2వారాల పాటు ఇళ్లలోనే ఉండి, పౌష్ఠికాహారం తీసుకోవాలని ఏప్రిల్‌లో సూచించిన సీఎం జగన్‌.. అందుకోసం ప్రతి ఒక్కరికి రూ.2వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఈ సాయం అందింది. అయితే జూలై నుంచి బాధితుల బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నా, ఈ సాయం మాత్రం జమ కావడం లేదని తెలుస్తోంది. మరోవైపు నాలుగు రోజుల నుంచి ఆర్ధికసాయం నిలిపివేశామని అనంతపురం జిల్లా కలెక్టర్‌ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. మరోవైపు కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల కోసం ఇచ్చే సాయం కూడా ఆగినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక భారం పెరగడంతో.. ఈ సాయాన్ని ఆపేసినట్లు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారిక ప్రకటనను ఇవ్వలేదు.

Read More:

కంగ్రాట్స్ ఇండియా: రియా చక్రవర్తి తండ్రి

కరోనా వ్యాక్సిన్‌ని ఇలా పంపిణీ చేస్తే బావుంటుంది