శానిటైజర్‌ తాగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. పలు అనుమానాలు..!

| Edited By:

Apr 10, 2020 | 11:06 AM

మంచినీళ్లు అనుకునే జిల్లా వైద్యాధికారి శానిటైజర్‌ తాగారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన వైద్యాధికారి అనిల్ కుమార్..

శానిటైజర్‌ తాగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. పలు అనుమానాలు..!
Follow us on

మంచినీళ్లు అనుకునే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శానిటైజర్‌ తాగారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన వైద్యాధికారి అనిల్ కుమార్.. ఫోన్ మాట్లాడుతూ శానిటైజర్‌ తాగారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెకంట్రామిరెడ్డి ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని వాకబు చేశారు. కాగా అధికారి శానిటైజర్ తాగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ప్రమాదవశాత్తు ఆయన శానిటైజర్ తాగారా..? లేక కావాలనుకునే తాగారా..? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read This Story Also: AA20: రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌