‘నగదు బదిలీ పథకం’పై అజయ్‌ కల్లాం క్లారిటీ.. ఏపీ రైతులకు భరోసా

| Edited By:

Sep 09, 2020 | 4:50 PM

నగదు బదిలీ పథకంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద పగటిపూట 9 గంటల పాటు

నగదు బదిలీ పథకంపై అజయ్‌ కల్లాం క్లారిటీ.. ఏపీ రైతులకు భరోసా
Follow us on

Cash Transfer Scheme: నగదు బదిలీ పథకంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందిస్తామని సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. ఇందుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నగదు బదిలీ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరిందని అజయ్ కల్లాం తెలిపారు. దీనికి సంబంధించి డిసెంబర్‌లోపు శ్రీకాకుళం ల పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం విద్యుత్ లోడ్‌ ఎంత అవుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని, పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి 1500 కోట్లతో ఫీడర్‌లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఇక కొత్తగా పెట్టే మీటర్ల ఖర్చు డిస్స్కంలదేనని అజయ్ కల్లాం స్పష్టం చేశారు. నగదు బదిలీ విధానం వలన రైతులకు ప్రశ్నించే హక్కు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే విద్యుత్ సంస్థలకు కూడా ఉపశమనం లభిస్తుందని.. విద్యుత్ చార్జీలు పెరిగినా రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాదు భవిష్యత్‌లో మీటర్లు కాలిపోయినా ఆ బాధ్యత విద్యుత్ సంస్థలదేనని.. ఎంత హెచ్‌పీ మోటర్లు వాడినా ఇబ్బంది లేదని తెలిపారు. ఇక ప్రభుత్వం బిల్లు చెల్లింపులు ఆలస్యం అయినా కరెంట్ కట్ చేయడం ఉండదని ఆయన తెలిపారు.

ఇక కౌలు రైతులకు కూడా దీని వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని అజయ్ కల్లాం వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో 8650 కోట్లు చెల్లించామని, 7000 పైగా జూనియర్ లైన్ మెన్లను నియమించామని ఆయన తెలిపారు. రైతులకు ఎన్ని కనెక్షన్లు ఉన్నా ఎలాంటి అభ్యంతరం ఉండదని, ఎలాంటి సమస్యలు, అనుమానాలు ఉన్నా  1912 కి కాల్ చేయొచ్చని అజయ్‌ కల్లాం వివరించారు.

Read More:

90 ఏళ్ల వృద్ధురాలిపై 37 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్‌

ఓటీటీలో పవన్‌ ‘వకీల్‌ సాబ్’..!‌