అహోబిలం గుడి పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని ప్రముఖ అహోబిలం ఆలయంలోని పూజారికి కరోనా సోకింది.

అహోబిలం గుడి పూజారికి కరోనా.. దర్శనాలకు బ్రేక్
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2020 | 7:04 AM

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని ప్రముఖ అహోబిలం ఆలయంలోని పూజారికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో పూజారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ మేనేజర్ వైకుంఠం వెల్లడించారు. దర్శనానికి ఎప్పుడు అనుమతిని ఇస్తామన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఇదివరకే దాదాపు రెండు నెలల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వకపోగా.. తాజాగా మరోసారి దర్శనాలకు బ్రేక్ పడింది. కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,516 మంది చికిత్స పొందుతున్నారు.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

Read This Story Also: Breaking: ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌకలో ప్రమాదం

Latest Articles
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!