తెలంగాణ పల్లెల్లో కరోనా టెర్రర్‌.. 1500 గ్రామాలకు సోకిన కరోనా!

| Edited By:

Aug 04, 2020 | 1:08 PM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే అధికంగా ఉన్న ఈ వైరస్‌ ఇప్పుడు పల్లెలకు విస్తరిస్తోంది.

తెలంగాణ పల్లెల్లో కరోనా టెర్రర్‌.. 1500 గ్రామాలకు సోకిన కరోనా!
Follow us on

Coronavirus Spreads to villages: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే అధికంగా ఉన్న ఈ వైరస్‌ ఇప్పుడు పల్లెలకు విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే  దాదాపు 1500మంది గ్రామాలకు కరోనా సోకింది. త్వరలోనే ఈ వైరస్ మరిన్ని గ్రామాలకు విస్తరించే ప్రమాదం ఉంది. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు పట్టణాల కంటే గ్రామాలే సురక్షితం అనే భావన ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలు ప్రమాదకరంగా మారాయి.  పెళ్లిళ్లు, ఫంక్షన్లు, వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామీణ ప్రజలు ఎక్కువ మందితో కలవాల్సి వస్తుండగా.. వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఇక ఇదే రీతిలో కొనసాగితే ఆగష్టు నెల చివరికి రాష్ట్రంలోని మరో 5 వేల గ్రామాల్లోకి వైరస్ చేరే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ.. పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడికి పటిష్టమైన చర్చలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు గ్రామాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read This Story Also: Murder Song: వర్మ పాడిన మర్డర్‌ పాట విన్నారా!