టీడీపీ-వైసీపీ మధ్య ‘గోడ’ వివాదం.. 144 సెక్షన్ విధింపు

| Edited By:

Jul 27, 2019 | 1:28 PM

గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ-వైసీపీ మధ్య గోడ నిర్మాణ వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు.. టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్‌ రెడ్డి, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ తదిరులను అరెస్టు చేసి నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత పొనుగుపాడులో టీడీపీ, వైసీపీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో వైసీపీ వర్గీయులు రోడ్డుకు అడ్డంగా గోడకట్టారు. గోడకు ఆవలివైపు ఉండే […]

టీడీపీ-వైసీపీ మధ్య ‘గోడ’ వివాదం.. 144 సెక్షన్ విధింపు
Follow us on

గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ-వైసీపీ మధ్య గోడ నిర్మాణ వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు.. టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్‌ రెడ్డి, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ తదిరులను అరెస్టు చేసి నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత పొనుగుపాడులో టీడీపీ, వైసీపీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో వైసీపీ వర్గీయులు రోడ్డుకు అడ్డంగా గోడకట్టారు. గోడకు ఆవలివైపు ఉండే టీడీపీ కార్యకర్తలు తమ ఇళ్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కొంతమంది నేతలు గ్రామంలో పర్యటించేందుకు శనివారం వెళ్లారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ గ్రామం వెలుపలే వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు.