Watch Video: అభివృద్దిపై మంత్రి ఫోకస్.. దానికే తొలి ప్రధాన్యం ఇచ్చిన స్థానికులు..

| Edited By: Srikar T

Jul 15, 2024 | 7:09 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉద్యాన వనం శిధిలావస్థకు చేరుకుంది. 2014 టిడిపి హయంలో పట్టణం మధ్యలో మంచి నీటి చెరువు వద్ద కోటిన్నర వ్యయంతో నిర్మించారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం గత ఐదు సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్ల నిర్లక్ష్యంతో ఐ లవ్ అమలాపురం కాస్త ఐ హేట్ అమలాపురం‎గా మారిందంటున్నారు స్థానికులు.

Watch Video: అభివృద్దిపై మంత్రి ఫోకస్.. దానికే తొలి ప్రధాన్యం ఇచ్చిన స్థానికులు..
Amalapuram
Follow us on

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉద్యాన వనం శిధిలావస్థకు చేరుకుంది. 2014 టిడిపి హయంలో పట్టణం మధ్యలో మంచి నీటి చెరువు వద్ద కోటిన్నర వ్యయంతో నిర్మించారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం గత ఐదు సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్ల నిర్లక్ష్యంతో ఐ లవ్ అమలాపురం కాస్త ఐ హేట్ అమలాపురం‎గా మారిందంటున్నారు స్థానికులు. జిల్లా ప్రధాన కేంద్రం కావడంతో అమలాపురం వచ్చేవారు ఈ పార్క్‎లో కాసేపు సరదాగా గడుపుతూ ఉంటారు. గతంలో సెలవు రోజులతో పాటు నిత్యం పిల్లలు, యువత, పెద్దలు, వృద్ధులతో కలకలలాడుతుండే ఈ పార్క్ సదుపాయాల లేక వెలవెలబోతోంది. పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు, బ్రిడ్జ్ స్లైడ్, బొమ్మల ఆకారంలో నిర్మించినవన్నీ విరిగిపోయి పాడైపోయాయి.

మరోపక్క వాకింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాక్ పూర్తిగా తడిసి ఇబ్బందిగా మారింది. పెద్ద సంఖ్యలో జనాలు వాకింగ్ చేసుకోవటానికి అణువుగా వుండే పార్క్ ఇప్పుడు అడుగుతీసి అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడంలేదు. సరదాగా కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అంటే కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయంటున్నారు ప్రకృతి ప్రేమికులు. అప్పట్లో ఈ పార్కును చక్కగా రూపొందించారని చెబుతూనే.. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ దీనిని సరిగా చూసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివృద్ది చేయాలని విన్నవించుకుంటున్నారు. మళ్లీ గతంలో లాగా అహ్లాదకరంగా రూపొందించాలని కోరుకుంటున్నారు. అమలాపురంతో పాటూ ఈ పార్క్ ను ఫస్ట్ లిస్ట్ లో పెట్టి అభివృద్ది చేయాలని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…