పరాయి వ్యక్తితో లాడ్జికి వచ్చిన సేల్స్ ఉమెన్.. తెల్లారేసరికల్లా విగతజీవిగా మారిన ఎర్రమ్మ!

విజయవాడ నగరంలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. కృష్ణలంక ప్రాంతంలోని రామయ్య లాడ్జిలో పైడిశెట్టి ఎర్రమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను హత్య చేసి లాడ్జి గది తలుపుకు తాళం వేసి పరారైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పరాయి వ్యక్తితో లాడ్జికి వచ్చిన సేల్స్ ఉమెన్.. తెల్లారేసరికల్లా విగతజీవిగా మారిన ఎర్రమ్మ!
Woman Murder

Updated on: Nov 14, 2026 | 7:28 AM

విజయవాడ నగరంలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. కృష్ణలంక ప్రాంతంలోని రామయ్య లాడ్జిలో పైడిశెట్టి ఎర్రమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను హత్య చేసి లాడ్జి గది తలుపుకు తాళం వేసి పరారైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

మృతురాలు ఎర్రమ్మ విజయవాడలోని శుభమస్తు షాపింగ్ మాల్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తోంది. రెండు రోజులుగా భార్య కనిపించడం లేదని ఆమె భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో భాగంగా ఎర్రమ్మ సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను పరిశీలించగా, ఆమె చివరిగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ లాడ్జి వద్ద స్కూటీని నిలిపినట్లు గుర్తించారు. ఆ ఆధారాలతో రామయ్య లాడ్జికి చేరుకున్న పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా ఎర్రమ్మ విగతజీవిగా పడి ఉంది.

పోలీసుల విచారణ ప్రకారం రాము అనే యువకుడితో కలిసి ఎర్రమ్మ లాడ్జికి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెను హత్య చేసి గది తలుపుకు తాళం వేసి నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుడి ఆచూకీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us