ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావం.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ అడుగుపెట్టింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ వేదికగా నవంబర్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదికగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావం.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Parivarthana Rajaneethi Party

Updated on: Nov 11, 2026 | 11:42 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ అడుగుపెట్టింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ వేదికగా నవంబర్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదికగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

పార్టీ ఎజెండాలో యువతకు 60 శాతం అవకాశాలు కల్పించడం ప్రధాన అంశంగా ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి, ఉపాధి కల్పన, విద్య, వ్యవసాయం వంటి అంశాలపై పార్టీ దృష్టి సారించనుంది. గతంలో ప్రకటించిన ప్రణాళికల్లో రైతులకు ఉచిత విద్యుత్, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రజల ఆదాయాలు పెంచడం వంటి అంశాలను కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.

‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగులతో రూపొందించిన జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును ఏర్పాటు చేశారు. కొత్త పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు.

కొత్త పార్టీ ద్వారా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయ వేదికను అందిస్తామని ఆయన గతంలో ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, నాయకత్వ బాధ్యతలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పరివర్తన రాజనీతి పార్టీ రాకతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us