
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. దీంతో ఇది సామాన్యులకు ఊరట కల్గిస్తోంది. గత కొంతకాలంగా ధరలు పెరిగిపోతుండగా.. ఇప్పుడు దిగిస్తుండటంతో సామాన్య, మధ్యగరతి ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. గత కొద్ది నెలల క్రితం కోలో టమాటా రూ.60కి చేరుకోగా.. కిలో ఉల్లి రూ.100కి ఎగబాకింది. అయితే ప్రస్తుతం ధరలు డౌన్ అయ్యాయి. కిలో టమాటా రూ.30కి లభిస్తుండగా.. ఉల్లి రూ.60కి విక్రయిస్తున్నారు. రోజూ వంటిల్లో ఉపయోగించే ఈ కూరగాయల ధరలు తగ్గడం వల్ల సామాన్యుల బడ్జెట్‌ను అదుపులో ఉంచుతోంది. నవంబర్ 11వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
కూకట్ పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కిలో టమాటా రూ.23, వంకాయ రూ.18, బెండకాయ రూ.45, పచ్చిమిర్చి రూ.50, బజ్జీ మిర్చి రూ.55, కాకరకాయ రూ.31, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.16, చిక్కుడుకాయ రూ.65, క్యారెట్ రూ.55, కాలీఫ్లవర్ రూ.25, దొండకాయ రూ.23, చిక్కుడు కాయలు రూ.50, గోరుచిక్కుడు రూ.35, బీట్‌రూట్ రూ.19, క్యాప్సికం రూ.45, ఆలుగడ్డ రూ.19కు అమ్ముతున్నారు. స్థానిక కీరదోస రూ.18, ఇటాలియన్ కీరదోస రూ.28, దోసకాయ రూ.28, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.23, కందగడ్డ రూ.45, పచ్చి ఉల్లిపాయలు రూ.40, ఎండు ఉల్లిపాయలు రూ.40, చింతకాయ రూ.45, పచ్చి మామిడికాయలు రూ.15 నుంచి రూ.20కు లభిస్తున్నాయి.పచ్చి అరటికాయలు)ఒక్కొక్కటి రూ.8 నుంచి రూ.10, చామగడ్డ రూ.40, ముల్లంగి ఒక్కటి రూ.6 నుంచి రూ.8, చిలగడదుంప రూ.35, గుమ్మడికాయ రూ.25గా కొనసాగుతున్నాయి. అలాగే నిమ్మకాయలు డజను రూ.50 నుంచి రూ.60 వరకు, మునగకాయ ఒక్కటి రూ.8 నుంచి రూ.10 వరకు, బొప్పాయి కిలో రూ.50, పుట్టగొడుగులు 200 గ్రాములు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఎండు మిర్చి కేజీ రూ.280, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260, చింతపండు రూ.160, ఎర్ర మిరపకాయలు రూ.80, ఉసిరికాయలు రూ.45, కరివేపాకు రూ.80, పర్వల్ రూ.28, వేరుశనగ కాయలు రూ.60, అలసందలు రూ.35, ఆకాకరకాయలు రూ.85గా ఉన్నాయి.
విజయవాడలోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.30, వంగ రూ.36, బజ్జిమిర్చి రూ.31, క్యాబేజీ రూ.25, బంగాళదుంప రూ.26, క్యాప్చికం రూ.65, చిలకడదుంప రూ.45, బెండ రూ.28, కాకర రూ.34, క్యారెట్ రూ.49, గోరుచిక్కుడు రూ.36, ఉల్లిపాయలు రూ.35, చామ రూ.35, బీన్స్ రూ.86, బీట్ రూట్ రూ.36, కంద రూ.39, కీరదోస రూ.45, సొర రూ.20, పొట్లకాయ రూ.20 పలుకుతున్నాయి.