Vallabhaneni Vamsi: సంకల్పసిద్ది అంటే ఏంటో తెలియదు.. టీడీపీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ

|

Dec 01, 2022 | 9:18 PM

సంకల్పసిద్ధి స్కామ్ కేసులో తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. 11వేలకోట్ల ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని.. కానీ అవన్నీ లేకుండా అర్ధరహితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Vallabhaneni Vamsi: సంకల్పసిద్ది అంటే ఏంటో తెలియదు.. టీడీపీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi
Follow us on

Sankalp Siddhi Scam: సంకల్పసిద్ధి స్కామ్ కేసులో తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. 11వేలకోట్ల ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని.. కానీ అవన్నీ లేకుండా అర్ధరహితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంకల్పసిద్ధి కేసులో వస్తున్న ఆరోపణల మధ్య వల్లభనేని వంశీ గురువారం రాత్రి డీజీపీని కలిసి టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల ఆరోపణలపై సీఐడీ విచారణ కోరతానని వంశీ తెలిపారు. దీనిపై కోర్టును కూడా ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు సంకల్పసిద్ది పేరు.. అందులో మనుషులు తెలియదంటూ స్పష్టంచేశారు. మీడియాలో తనపై, కొడాలి నానిపై ఆరోపణలు చేశారని.. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు.

ఆధారాలు చూపాలని.. లేకుంటే కోర్టుకు సమాధానం చెప్పాలని వంశీ స్పష్టంచేశారు. 11వేల కోట్ల ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని.. కానీ.. అవన్నీ లేకుండా ఎలా పడితే అలా మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆధారాలు చూపండి లేకుంటే క్షమాపణ చెప్పండంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వారు క్షమాపణ చెప్తారో జైలుకు వెళ్తారో చూడాలంటూ పేర్కొన్నారు.

కాగా, విజయవాడ కేంద్రంగా జనానికి రూ.కోట్లలో కుచ్చుటోపి పెట్టిన సంకల్పసిద్ది స్కామ్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గొలుసుకట్టు వ్యాపారం పేరిట వేలకోట్ల రూపాయలను దండుకుని.. నిందితులు బోర్డు తిప్పేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..